ఐపీఎల్కు విండీస్ క్రికెటర్లు ఓకే | West Indies players to play in IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్కు విండీస్ క్రికెటర్లు ఓకే

Oct 21 2014 3:44 PM | Updated on Sep 2 2017 3:13 PM

ఐపీఎల్కు విండీస్ క్రికెటర్లు ఓకే

ఐపీఎల్కు విండీస్ క్రికెటర్లు ఓకే

భారత పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని వెస్టిండీస్ క్రికెటర్లు స్వదేశం వెళ్లడం వివాదాస్పదమైనా.. ఐపీఎల్లో వాళ్లు ఆడనున్నారు.

హైదరాబాద్: భారత పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని వెస్టిండీస్ క్రికెటర్లు స్వదేశం వెళ్లడం వివాదాస్పదమైనా.. ఐపీఎల్లో వాళ్లు ఆడనున్నారు. కరీబియన్లను అనుమతించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం బిస్వాల్ మీడియాతో మాట్లాడారు.

భారత్తో సిరీస్ మధ్యలో వెస్టిండీస్ క్రికెటర్లు వెనుదిరగడం వల్ల బీసీసీఐ భారీ నష్టం వాటిల్లింది. దీంతో విండీస్ ద్వైపాక్షిక టూర్లను రద్దు చేసుకుంటున్నట్టు బోర్డు ప్రకటించింది. అయితే ఐపీఎల్లో ఆడేందుకు విండీస్ ఆటగాళ్లను అనుమతిస్తున్నట్టు ఐపీఎల్ చైర్మన్ తెలిపారు. విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ సహా డ్రావో, డ్వెన్ స్మిత్, పొలార్డ్, నరైన్ తదితర ఆటగాళ్ల ఐపీఎల్లో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement