ఆసియా చెస్‌ చాంప్‌ పద్మిని 

Wei Yi Wins Asian Continental Championship - Sakshi

మకాటి (ఫిలిప్పీన్స్‌): అజేయ ప్రదర్శనతో భారత చెస్‌ అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) క్రీడాకారిణి పద్మిని రౌత్‌ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పద్మిని మొత్తం ఏడు పాయింట్లు సాధించి కియాన్‌యున్‌ గాంగ్‌ (సింగపూర్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా పద్మినికి టైటిల్‌ లభించింది. కియాన్‌యున్‌ గాంగ్‌ రన్నరప్‌గా నిలిచింది.

ఒడిశాకు చెందిన 24 ఏళ్ల పద్మిని ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్‌ విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. సూర్యశేఖర గంగూలీ నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా ఘనతతో పద్మిని... 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చెస్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన ఎనిమిదో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో రోహిణి ఖాదిల్కర్‌ (1981, 1983), అనుపమ గోఖలే (1985, 1987) రెండేసి సార్లు ఈ టైటిల్‌ నెగ్గగా... భాగ్యశ్రీ థిప్సే (1991), కోనేరు హంపి (2003), తానియా సచ్‌దేవ్‌ (2007), ద్రోణవల్లి హారిక (2011), భక్తి కులకర్ణి (2016) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top