ఒలింపిక్స్‌ అప్డేట్స్ కోసం రోబో | washinton post use new technology for rio updates | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ అప్డేట్స్ కోసం రోబో

Aug 6 2016 5:27 PM | Updated on Oct 22 2018 6:05 PM

ఒలింపిక్స్‌ అప్డేట్స్ కోసం రోబో - Sakshi

ఒలింపిక్స్‌ అప్డేట్స్ కోసం రోబో

సోషల్‌మీడియా వెబ్ సైట్స్ ట్విట్టర్‌, ఫేస్ బుక్ లో రెండు వారాల పాటు క్రీడా వార్తల సందడి నెలకొంటుంది.

రియోడిజెనీరో: రియో ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోషల్‌మీడియా వెబ్ సైట్స్ ట్విట్టర్‌, ఫేస్ బుక్, వాట్సాప్ లోనూ రెండు వారాల పాటు క్రీడా వార్తల సందడి నెలకొంటుంది. అయితే ఈ సారి అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ ఇచ్చే ట్విట్టర్ పోస్ట్‌లు, సంక్షిప్త వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆ మీడియా సంస్థ ఈ ఒలింపిక్స్ వార్తల కవరేజీకి కృత్రిమ మేధస్సు సాయం తీసుకుంటోంది.

సొంతంగా హీలియోగ్రాఫ్ పేరుతో సిద్ధం చేసుకన్న ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో వార్తలందించేందుకు రోబో సిద్ధమవుతోంది. ఏ పోటీలో ఎవరు గెలిచారు ? ఏ దేశం ఎన్ని మెడల్స్ సాధించింది.. వంటి వివరాలకు సంబంధించిన వార్తలను ఈ సాఫ్ట్‌వేర్ పొట్టి సందేశాల రూపంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంది.  సృజనాత్మకమైన, వివరణాత్మక కథనాలు ఇచ్చే వెసలుబాటు కల్పించేందుకు మాత్రమే తాము దీన్ని వాడుతున్నామని వాషింగ్టన్ పోస్ట్ ప్రతినిధి జెరెమీ గిల్బర్ట్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement