వకార్ పై మండిపడ్డ రజాక్ | Sakshi
Sakshi News home page

వకార్ పై మండిపడ్డ రజాక్

Published Sat, Apr 23 2016 6:25 PM

వకార్ పై మండిపడ్డ రజాక్

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ కోచ్గా పని చేసి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన వకార్ యూనిస్పై ఆ దేశ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మండిపడ్డాడు. వకార్ వల్ల పాకిస్తాన్ క్రికెట్కు తీరని నష్టం జరిగిందంటూ రజాక్ విమర్శించాడు. వకార్ అతని వైఫల్యాన్ని పక్కకు పెట్టి ఇతరుల్ని తప్పుబడుతున్నాడన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని నిలదీశాడు.


పాకిస్తాన్ క్రికెట్లో రహస్యమేమీ లేదు. సీనియర్ ఆటగాళ్లకు వకార్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. దాంతో పాటు ఆటగాళ్లని కూడా సమాన దృష్టితో కూడా చూసేవాడు కాదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించే పని ఎప్పుడూ చేయలేదు. ఇందుకు నేనే సాక్ష్యం. దానికి అతనిలో ఉన్న అభద్రతా భావమే ప్రధాన కారణం. పదే పదే తప్పులు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ అట్టడుగు స్థాయికి వెళ్లడానికి వకార్ కారణమమయ్యాడు 'అని రజాక్  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ సలహాదారులుగా యూనస్ ఖాన్, మిస్బాబుల్ హక్లను నియమించడం పట్ల కూడా రజాక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ క్రికెట్ కు జరిగిన అన్యాయానికి వారు ఏ విధమైన సలహా ఇస్తారని ప్రశ్నించాడు.  కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు కూడా దేశ క్రికెట్ ను దిగజార్చాడానికి పరోక్షంగా కారణమయ్యారని రజాక్ ధ్వజమెత్తాడు.

Advertisement
Advertisement