ఆనంద్ శుభారంభం | Viswanathan Anand set to play London Classic, Magnus Carlsen opts out | Sakshi
Sakshi News home page

ఆనంద్ శుభారంభం

Dec 12 2013 1:12 AM | Updated on Sep 2 2017 1:29 AM

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పరాజయం తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు.

లండన్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పరాజయం తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ తొలి విజయం సాధించాడు.
 
 గ్రూప్ ‘ఎ’లో ల్యూక్ మెక్‌షేన్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి గేమ్‌లో ఆనంద్ నల్లపావులతో ఆడుతూ 46 ఎత్తుల్లో గెలిచాడు. మొత్తం 16 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్‌లో నలుగురికి చోటు కల్పించారు. లీగ్ దశ గేమ్‌లు ముగిశాక ఒక్కో గ్రూప్ నుంచి ఇద్దరు చొప్పున క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘ఎ’లో ఆనంద్‌తోపాటు ల్యూక్ మెక్‌షేన్, మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), ఆండ్రియా ఇస్ట్రాటెస్కూ (ఫ్రాన్స్) ఉన్నారు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఆనంద్ బుధవారం 44వ వడిలోకి అడుగుపెట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement