మళ్లీ దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్ | Virat Kohli slips down to fourth spot in Test rankings for batsmen | Sakshi
Sakshi News home page

మళ్లీ దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్

Mar 13 2017 4:39 PM | Updated on Sep 5 2017 5:59 AM

మళ్లీ దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్

మళ్లీ దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ దిగజారుతోంది.

ముంబై: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ దిగజారుతోంది. తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో కోహ్లీ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. విరాట్ ఇటీవలే రెండో ర్యాంక్‌ నుంచి మూడో ర్యాంకుకు దిగజారిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ రాణించలేకపోవడంతో ర్యాంక్ పడిపోయింది. ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విరాట్ వరుసగా 0, 13, 12, 15 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైఫల్యం ర్యాంక్‌పై ప్రభావం చూపింది.

తాజా జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకుకు దూసుకెళ్లాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆల్‌రౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ అశ్విన్ నెంబర్ ర్యాంక్‌ను మళ్లీ కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ రెండో స్థానానికి దిగజారాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement