అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ? | Virat Kohli Reveals What He Told Anushka Sharma When They First Met | Sakshi
Sakshi News home page

అనుష్కను మొదటిసారి ఎలా కలిశానో తెలుసా ?

Sep 5 2019 9:56 PM | Updated on Sep 5 2019 10:04 PM

Virat Kohli Reveals What He Told Anushka Sharma When They First Met - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-అనుష్కశర్మ జోడిది ఒక చక్కని ప్రేమకథ అన్న సంగతి అందరికి తెలిసిందే . 2013లో మొదలైన వీరిద్దరి ప్రేమాయణం చివరికి 2017లో ఇటలీలో జరిగిన వివాహంతో ఒక్కటయ్యారు. ఇదే విషయమై అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌ రిపోర్టర్‌ గ్రాహమ్‌బెరసింజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ తొలిసారి తనకు పరిచయం ఎలా అయిందో విరాట్‌ చెప్పుకొచ్చాడు.

'తొలిసారి తామిద్దరం ఒక షాంపు ప్రకటన కోసం కలుసుకున్నామని తెలిపాడు. తొలిసారి తనను చూసినప్పుడే ఎలాగైనా ఆమెతో మాట్లాడటానికి మంచి జోక్‌ వేస్తే బాగుంటుందని అనుకున్నాను. వెంటనే అనుష్క వేసుకున్న హీల్స్‌ గురించి కామెంట్‌ చేస్తూ.. ఇంతకన్నా ఎత్తైనా హీల్స్‌ నీకు దొరకలేదా అంటూ తన పొడవునుద్దేశించి జోక్‌ వేశాను. దానికి అనుష్క నుంచి సరైన రీతిలో సమాధానం రాలేదు. అప్పటికే ఆమె మేనేజర్‌ కోహ్లి 6 అడుగుల ఎత్తు ఉండడు కాబట్టి హీల్స్‌ వేసుకోవద్దని ముందుగానే చెప్పడంతో నాకు తెలియక అదే జోక్‌ వేయడంతో అది కాస్తా ఫేయిలయ్యిందని' చెప్పుకొచ్చాడు. అలా తొలిసారి తాను అనుష్కతో మాట్లాడడానికి ప్రయత్నించానని పేర్కొన్నాడు. ఆ తర్వాత చాలాసార్లు పలు ఈవెంట్లలో కలుసుకోవడంతో మా స్నేహం ప్రేమగా మారి మా ఇద్దరిని ఒకటి చేసిందని కోహ్లి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement