క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ | Virat Kohli breaks Chris Gayle's IPL batting record | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

May 17 2016 9:28 AM | Updated on Sep 4 2017 12:18 AM

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

సూఫర్ ఫామ్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.

న్యూఢిల్లీ: సూఫర్ ఫామ్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు చేసి, ఓ సీజన్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మన్గా విరాట్ నిలిచిన సంగతి తెలిసిందే. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు (752) చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ తాజాగా మరో రికార్డు నెలకొల్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే చెందిన విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (733) పేరిట ఉన్న ఈ రికార్డును విరాట్ బద్దలుకొట్టాడు.

సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ (51 బంతుల్లో 75) అజేయ హాఫ్ సెంచరీ చేయడంతో గేల్ రికార్డు తెరమరుగైంది. ఈ సీజన్లో కోహ్లీ 12 మ్యాచ్ల్లోనే 752 పరుగులు చేయడం విశేషం. కోల్కతా మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగుల వీరులు

విరాట్ కోహ్లీ 752
క్రిస్ గేల్ 733
మైఖేల్ హస్సీ 733
క్రిస్ గేల్ 708
రాబిన్ ఊతప్ప 660

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement