
ధర్మశాల:టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 65 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంకేయులు ఆదిలో తడబడ్డారు. 19 పరుగులే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఉపుల్ తరంగా(49) ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. కాగా, హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు గుణతిలకా(1), తిరుమన్నే(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. లంకేయులు కోల్పోయిన మూడు వికెట్లలో బూమ్రా, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 112 పరుగులకు చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. ధోని(65) మినహా ఎవరూ రాణించలేదు.