తెలంగాణ వారియర్స్‌కు టైటిల్‌ | telangana warriors wins all star basket ball title | Sakshi
Sakshi News home page

తెలంగాణ వారియర్స్‌కు టైటిల్‌

Dec 15 2017 10:31 AM | Updated on Dec 15 2017 10:31 AM

సాక్షి, హైదరాబాద్‌: ఆల్‌స్టార్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వారియర్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. వైఎంసీఏ గ్రేటర్‌ హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్‌ బాలికల విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన తుదిపోరులో తెలంగాణ వారియర్స్‌ 37–30తో చాలెంజర్స్‌ జట్టుపై గెలుపొందింది. సీనియర్‌ బాలుర విభాగంలో నవాబ్స్‌ జట్టు విజేతగా నిలిచింది. టైటిల్‌పోరులో నవాబ్స్‌ 65–42తో శాతవనస్‌పై నెగ్గింది.

జూనియర్‌ బాలబాలికల విభాగాల్లో బుల్స్, హాక్స్‌ జట్లు టైటిళ్లను గెలుచుకున్నాయి. జూనియర్‌ బాలుర ఫైనల్లో బుల్స్‌ జట్టు 36–24తో వోల్వ్స్‌ జట్టుపై, బాలికల టైటిల్‌పోరులో హాక్స్‌ జట్టు 61–39తో లయన్స్‌ జట్టుపై అలవోకగా గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం కోశాధికారి ప్రేమ్‌ సోలోమన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement