చాంపియన్స్‌ విశ్రుత్, స్నేహా

Telangana State Ranking Chess Tournament: Vishruth And Sneha Champions - Sakshi

తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో కె. విశ్రుత్, బి. స్నేహా చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–17 బాలబాలికల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో 2 పాయింట్లతో విశ్రుత్, భవేశ్, అనికేత్‌ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో స్నేహా 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అండర్‌–15 బాలుర విభాగంలో 3.5 పాయింట్లు సాధించిన అజితేశ్‌ చాంపియన్‌గా నిలవగా...  3 పాయింట్లతో దైవిక్, వన్‌‡్ష వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో హరిణి నరహరి (3 పాయింట్లు), సాయి శ్రీయ నాయుడు (2 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) గౌరవ ఉపాధ్యక్షులు కేఏ శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు 
అండర్‌–7 బాలురు: 1. హరిరామ్, 2. ప్రతీక్‌ రెడ్డి, 3. శ్రీవశిష్ట; బాలికలు: 1. ఐశ్వర్య, 2. శాన్వి, 3. సహస్ర రెడ్డి. 
అండర్‌–9 బాలురు: 1. అన్‌‡్ష నందన్, 2. ఆరుశ్, 3. సాత్విక్‌; బాలికలు: 1. కీర్తిక, 2. ఆద్య, 3. లహరి. 
అండర్‌–11 బాలురు: 1. ఆరుశ్, 2. విశ్వజిత్, 3. అనిరుధ్‌; బాలికలు: 1. అస్మా, 2. ఫాతిమా, 3. పరిద్యా. 
అండర్‌–13 బాలురు: 1. త్రివేద్‌ రెడ్డి, 2. తుషార్, 3. హిమాకర్‌; బాలికలు: 1. గీతిక హాసిని, 2. శ్రీయ శర్మ, 3. నేహా. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top