ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్లు | Telangana Softball Teams In Pre Quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్లు

Oct 3 2019 9:44 AM | Updated on Oct 3 2019 9:44 AM

Telangana Softball Teams In Pre Quarters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నీలో తెలంగాణ పురుషులు, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతోన్న ఈ టోరీ్నలో బుధవారం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్లు గెలుపొందాయి. మహిళల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 8–0తో మణిపూర్‌పై, రెండో మ్యాచ్‌ లో 3–2తో రాజస్తాన్‌పై గెలిచాయి.

పురుషుల విభాగంలో తెలంగాణ 10–0తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించింది. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 4–0తో కేరళపై, చండీగఢ్‌ 4–3తో రాజస్తాన్‌పై, పంజాబ్‌ 9–0తో కర్ణాటకపై, మహారాష్ట్ర 15–0తో పాండిచ్చేరిపై, మధ్యప్రదేశ్‌ 10–0తో ఉత్తరప్రదేశ్‌పై, జమ్మూ కశీ్మర్‌ 10–0తో పాండిచ్చేరిపై, హరియాణా 6–4తో తమిళనాడుపై గెలుపొందాయి. మహిళల మ్యాచ్‌ల్లో ఢిల్లీ 10–0తో తమిళనాడుపై, పంజాబ్‌ 15–0తో ఒడిశాపై, ఛత్తీస్‌గఢ్‌ 10–0తో కర్ణాటకపై, ఆంధ్రప్రదేశ్‌ 6–2తో కేరళపై నెగ్గాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement