తెలంగాణ జట్టుకు టైటిల్‌

Telangana Softball Team Got Title - Sakshi

జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు సత్తా చాటింది. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 1–0తో రాజస్తాన్‌పై విజయం సాధించింది. తెలంగాణ జట్టు కెప్టెన్‌ ప్రియాంక ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. మరోవైపు బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. టోర్నీ ఆద్యంతం రాణించిన ఆంధ్రప్రదేశ్‌ చివరిపోరులో తేలిపోయింది. 

టైటిల్‌ పోరులో 1–2తో రాజస్తాన్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్‌ సంఘం కోశాధికారి శ్రీకాంత్‌ థోరట్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top