లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.
నాగపూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. 69 పరుగులకు ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు.
50 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(12)ను ఎల్గర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 40 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో పుజారా 18, విరాట్ కోహ్లి 11 పరుగులతో ఆడుతున్నారు.