
టీమిండియా మాజీ క్రికెటర్‌కు కీలక పదవి
టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ముంబయి క్రికెట్ సంఘం సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు.
ముంబయి: టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ముంబయి క్రికెట్ సంఘం సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ టీమ్, అండర్-23 ఆటగాళ్ల ఎంపిక చేసే బృందాలకు అగార్కర్ నేతృత్వం వహించాల్సి ఉంటుంది. జతిన్ పరాంజేప్, సునిల్ మోరే నీలేశ్ కుల్‌కర్ణిలను ఇతర కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. టీమిండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ అండర్-19 టీమ్ ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా, ఆవిష్కార్ సాల్వి, రాజు సతర్, సంతోష్ షిండేలను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.
అజిత్ అగార్కర్ 1998లో ఆస్ట్రేలియాపై వన్డేలో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టెస్టుల్లో జింబాబ్వేపై తొలి మ్యాచ్ ద్వారా కెరీర్ ఆరంభించాడు. టీమిండియా తరఫున 191 వన్డేలు ఆడి 288 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో 28 టెస్టులాడిన అగార్కర్ 58 వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్‌గా దశాబ్దకాలం టీమిండియాకు సేవలందించాడు. 1996-97 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అగార్కర్.. ఓవరాల్‌గా 110 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 30.69 సగటుతో 299 వికెట్లు పడగొట్టాడు. అతడి కెప్టెన్సీలో ముంబయి 2012-13 సీజన్లో రంజీ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ముంబయి జట్టు రంజీల్లో విజేతగా 8 సీజన్లలో అతడు భాగస్వామి కావడం గమనార్హం.