ఉమ్మడిగా అగ్రస్థానంలో మిశ్రా | Swayams Mishra in joint lead in chess tournament | Sakshi
Sakshi News home page

ఉమ్మడిగా అగ్రస్థానంలో మిశ్రా

Oct 31 2017 10:47 AM | Updated on Oct 31 2017 10:47 AM

Swayams Mishra in joint lead in chess tournament

సాక్షి, హైదరాబాద్‌: టెట్రాసాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో స్వయమ్ష్ మిశ్రా (ఎయిరిండియా) ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. సికింద్రాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో నాలుగు రౌండ్లు ముగిసేసరికి 4 పాయింట్లతో మరో నలుగురితో కలసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. మిశ్రాతో పాటు ఆర్‌. అశ్వథ్, ముత్తయ్య, వినోద్‌కుమార్, ఎ.బాలకిషన్‌ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. సోమవారం జరిగిన నాలుగోరౌండ్‌ గేమ్‌లో ముత్తయ్య (4, తమిళనాడు) జె. రామకృష్ణ (3, ఆంధ్రాబ్యాంక్‌)పై, స్వయమ్ష్ మిశ్రా (4) ఎన్‌. లోకేశ్‌ (3)పై, ఆర్‌. అశ్వథ్‌ (4) భరత్‌ కుమార్‌ రెడ్డి (3)పై, వినోద్‌ కుమార్‌ (4) ఎస్‌. విక్రమ్‌జీత్‌ సింగ్‌ (3)పై, ఎ. బాలకిషన్‌ (4) సోహన్‌ (3)పై గెలుపొందారు. శ్రీశ్వాన్‌ (3.5)తో జరిగే గేమ్‌ను కుషాగ్రమోహన్‌ (3.5 తెలంగాణ) డ్రా చేసుకున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement