
ఆడొద్దని భావిస్తే తప్పుకోండి!
టెస్టుల మీద ఆసక్తి లేకపోతే తప్పుకోవాలని భారత క్రికెటర్లకు గవాస్కర్ సూచించారు. ‘భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాలని లేకుంటే వెంటనే తప్పుకోండి.
గవాస్కర్ ఘాటు విమర్శ
లండన్: టెస్టుల మీద ఆసక్తి లేకపోతే తప్పుకోవాలని భారత క్రికెటర్లకు గవాస్కర్ సూచించారు. ‘భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాలని లేకుంటే వెంటనే తప్పుకోండి. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుకోండి. అంతే గానీ ఈ రకంగా దేశం తలదించుకునేలా మాత్రం చేయవద్దు’ అంటూ సన్నీ ఘాటుగా విమర్శించారు. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందని... అయితే ‘మెత్తటి జెల్లీ’ తరహాలో ఏ మాత్రం ప్రతిఘటన ఇవ్వలేని భారత జట్టు వల్లే ప్రత్యర్థి కోలుకుందని ఆయన అన్నారు. భారత జట్టునుంచి ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురు కావచ్చని ఇంగ్లండ్ భావించిందని, ఇంత సునాయాసంగా జట్టు లొంగిపోవడం బహుశా వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చని గవాస్కర్ విశ్లేషించారు. ప్రస్తుత జట్టు భారత్ బయట ఒకట్రెండు మ్యాచ్‌లు గెలవగలిగినా... టెస్టు సిరీస్ గెలవడం అసాధ్యమన్నారు.