వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ | Stuart Binny replaces Varun Aaron in Indian team | Sakshi
Sakshi News home page

వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

Nov 4 2014 3:28 PM | Updated on Sep 2 2017 3:51 PM

వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

గాయపడిన భారత పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు.

న్యూఢిల్లీ: గాయపడిన భారత పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు. శ్రీలంకతో జరగనున్న రెండు, మూడు వన్డేలకు ఆరోన్ స్థానంలో బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక-భారత్ రెండో వన్డే గురువారం అహ్మదాబాద్ లో జరగనుంది. జూన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బిన్నీ చివరిసారిగా ఆడాడు.

ఈ నెల 2న జరిగిన తొలి వన్డేలో కుడికాలి కండరాలు పట్టేయడంతో ఆరోన్ బౌలింగ్ చేయలేకపోయాడు. 13వ ఓవర్ లో ఆరోన్ వైదొలగడంతో అతడి కోటాను కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement