స్మిత్‌ ఎందుకలా చేశాడు? | Steve Smith Punishes Himself | Sakshi
Sakshi News home page

తనను తాను శిక్షించుకున్న స్మిత్‌

Nov 26 2019 7:14 PM | Updated on Nov 26 2019 7:41 PM

Steve Smith Punishes Himself - Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తనను తాను శిక్షించుకున్నాడు.

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తనను తాను శిక్షించుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో విఫలమైనందుకు మూడు కిలోమీటర్లు పరుగెత్తి తనకు తాను శిక్ష వేసుకున్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత బస్సు మిస్సైన స్మిత్‌.. స్టేడియం నుంచి 3 కిలోమీటర్లు పరుగెత్తి హోటల్‌కు చేరుకున్నాడు. ‘పరుగులు చేయనప్పుడు నన్ను నేను శిక్షించుకుంటాను. సెంచరీ చేస్తే చాక్లెట్‌ తీసుకుని నన్ను నేను అభినందించుకుంటాను. మ్యాచ్‌లో ఎప్పుడు విఫలమైనా పరుగెత్తడం లేదా జిమ్‌కు వెళ్లడం చేస్తాను. నన్ను నేను శిక్షించుకోవడానికి ఏదోటి చేస్తుంటాన’ని స్మిత్‌ చెప్పాడు.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ 4 పరుగులు మాత్రమే చేసి యాసిర్‌ షా బౌలింగ్‌లో అవుటయ్యాడు. డేవిడ్‌ వార్నర్‌(154), లబ్‌షేన్‌(185) సెంచరీలతో చెలరేగారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు 29 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతడికి చేరువగా వచ్చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టులో స్మిత్‌ విఫలం కావడంతో ఇద్దరి మధ్య అంతరం 25 నుంచి 3 పాయింట్లకు తగ్గిపోయింది. (చదవండి: కోహ్లి వచ్చేస్తున్నాడు స్మిత్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement