శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ | Sri Valli Leads In ITF Womens Tourney | Sakshi
Sakshi News home page

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

Jul 16 2019 10:14 AM | Updated on Jul 16 2019 10:14 AM

Sri Valli Leads In ITF Womens Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో తెలంగాణ క్రీడాకారులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక ముందంజ వేశా రు. పోర్చుగల్‌లోని పల్మెలా వేదికగా సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌ పోటీల్లో వీరిద్దరూ గెలుపొందారు.

శ్రీవల్లి రష్మిక 4–6, 6–3, 13–10తో కింబర్లీ పుకుసా (బ్రిటన్‌)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్‌ సాత్విక 6–3, 6–1తో బెట్రిజ్‌ పసిలెట్టి డ్యూర్టె కోస్టా (పోర్చుగల్‌)ను ఓడించింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో అనా ఫిలిపా సాంటోస్‌ (పోర్చుగల్‌)తో సాత్విక, మూడో సీడ్‌ వాలెంటినా ఇవనోవ్‌ (న్యూజిలాండ్‌)తో శ్రీవల్లి రష్మిక ఆడతారు.

Advertisement
 
Advertisement
Advertisement