చండిమాల్‌పై వేటు | Sri Lankas captain Chandimal was not in the squad for the next series | Sakshi
Sakshi News home page

చండిమాల్‌పై వేటు

Feb 6 2019 2:22 AM | Updated on Feb 6 2019 2:22 AM

Sri Lankas captain Chandimal was not in the squad for the next series - Sakshi

కొలంబో: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌ వరకు శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్‌ చండిమాల్‌కు తర్వాతి సిరీస్‌కు జట్టులోనే చోటు లభించలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే లంక జట్టులో చండిమాల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ సిరీస్‌కు దిముత్‌ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 0–2తో లంక ఓడిన సిరీస్‌లో చండిమాల్‌ వరుసగా 5, 0, 15, 4 స్కోర్లు చేశాడు.

దాంతో దేశవాళీ క్రికెట్‌ ఆడి ఫామ్‌లోకి రావాలని అతనికి సెలక్టర్లు తేల్చి చెప్పారు. మరోవైపు సఫారీ పర్యటనకు నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చారు. బ్యాట్స్‌మెన్‌లు ఏంజెలో పెరీరా, ఒషాడా ఫెర్నాండోలతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లసిత్‌ ఎంబుల్‌డెనియా, పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షిరాజ్‌లకు తొలిసారి అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి డర్బన్‌లో తొలి టెస్టు జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement