
చెన్నైలో లంక ఆటగాళ్లకు నో ఎంట్రీ!
ఈసారి కూడా చెన్నైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి నిరాకరించారు.
న్యూఢిల్లీ: ఈసారి కూడా చెన్నైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఈనెల 9న చెన్నైతో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ దూరంకానున్నాడు. వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన మ్యాథ్యూస్ ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడు. లంకలో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా గత రెండేళ్ల నుంచి ఆ దేశ ఆటగాళ్లు చెన్నైలో ఆడేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఈసారి కూడా లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడేందుకు అనుమతి లేదని టీఎన్‌సీఏ సెక్రటరీ జనరల్ కాశీ విశ్వనాథన్ తెలిపారు.