ప్రొ కబడ్డీ లీగ్‌కు క్రీడా శాఖ ఆమోదం! | Sports ministry endorses Pro Kabaddi League | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ లీగ్‌కు క్రీడా శాఖ ఆమోదం!

Jul 5 2014 1:18 AM | Updated on Sep 2 2017 9:48 AM

ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్‌కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి.

బెంగళూరు: ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్‌కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి. ‘వారసత్వ క్రీడగా వస్తున్న కబడ్డీపై దృష్టిపెట్టడం చాలా సంతోషంగా ఉంది.

 
ఈ క్రీడకు మార్గదర్శకత్వం చేయనున్న మషాల్ స్పోర్ట్స్ కృషి ప్రశంసనీయం. క్రీడాకారుల్లో సామర్థ్యం, బలం, నైపుణ్యం, వ్యూహం, సమష్టి కృషిని పెంపొందించేందుకు ఈ ఆట దోహదం చేస్తుంది. కాబట్టి భారత యువతను ఈ క్రీడ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని క్రీడా శాఖ సెక్రటరీ అజిత్ ఎమ్. శరణ్...  ప్రొ కబడ్డీ లీగ్‌ను రూపొందించిన మషాల్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చారు శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement