గంగూలీకి ముందే చెప్పా: షమీ భార్య హసీన్‌

Spoke with Sourav Ganguly before taking the feud in public, Jahan - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీపై అతని భార్య హసీన్‌ జహాన్‌ లైంగిక వేధింపుల కేసు, అక్రమ సంబంధాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని బహిర్గతం చేసేముందు భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించానని హసీన్ స్పష్టం చేసింది.

‘నా భర్త షమీ వ్యవహారాన్ని బయటపెట్టేముందు గంగూలీకి చెప్పా. ప్రధానంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే ముందు నేను సౌరవ్ సార్‌కి ఫోన్ చేసిన నా సమస్యను వివరించాను. షమీ తప్పుదారిలో నడుస్తున్నాడని, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయనకు చెప్పాను. ఆ తర్వాత ఆయన నాకు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆయన ఫోన్ కోసం నేను ఎదురుచూస్తున్నా. ఇది వ్యక్తిగత విషయమని.. దీని గురించి ఆయన పట్టించుకోవడం లేదని అనుకుంటున్నా’ అని హసీన్ తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top