శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం | south africa beats srilanka by 8 wickets | Sakshi
Sakshi News home page

శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం

Mar 28 2016 10:33 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం - Sakshi

శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం

వరల్డ్ ట్వంటీ 20 టోర్నీలో శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20 టోర్నీలో శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే డీ కాక్ (9) వికెట్ ను కోల్పోయింది. అనంతరం హషీమ్ ఆమ్లా(56 నాటౌట్), డుప్లెసిస్(31) ఏబీ డివిలియర్స్(20 నాటౌట్)లు రాణించడంతో దక్షిణాఫ్రికా  17.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నెగ్గింది. దీంతో ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా రెండో విజయం సాధించగా, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన లంకేయులు ఒక గెలుపుతో సరిపెట్టుకున్నారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 120 పరుగులు నమోదు చేసింది. లంక జట్టులో చండీమల్(21), తిలకరత్నే దిల్షాన్(36) లు మోస్తరుగా రాణించారు. అనంతరం సిరివర్ధనే(15), షనాకా(20నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటడంతో దీంతో శ్రీలంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫంగిసో, బెహర్దియన్,  అబాట్లు తలో రెండు వికెట్లు సాధించగా స్టెయిన్,ఇమ్రాన్ తాహీర్లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.


ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి  నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి.  ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement