ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్ | Sindhu and marin in same group | Sakshi
Sakshi News home page

ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్

Dec 13 2016 1:48 AM | Updated on Sep 4 2017 10:33 PM

ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్

ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్

బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్, రన్నరప్‌ పీవీ సింధు ఒకే గ్రూప్‌లో ఉన్నారు.

దుబాయ్‌: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్, రన్నరప్‌ పీవీ సింధు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఈనెల 14 నుంచి దుబాయ్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌ ‘డ్రా’ వివరాలను వెల్లడించారు. గ్రూప్‌ ‘బి’లో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ మారిన్ (స్పెయిన్), సింధు (భారత్‌), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా)లకు చోటు కల్పించారు. గ్రూప్‌ ‘ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), సుంగ్‌ జీ హున్ (కొరియా), ఇంతనోన్ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), హీ బింగ్‌జియావో (చైనా) ఉన్నారు. లీగ్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement