శ్రీకాంత్‌కు షాక్ | Shuttler Srikanth ousted from Swiss Open | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు షాక్

Mar 12 2014 1:16 AM | Updated on Sep 2 2017 4:35 AM

శ్రీకాంత్‌కు షాక్

శ్రీకాంత్‌కు షాక్

ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.

స్విస్ ఓపెన్
 బాసెల్: ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్, ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-19, 18-21, 17-21తో అన్‌సీడెడ్ హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 53 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడు గేముల్లోనూ పలుదశల్లో వెనుకబడ్డాడు.
 
 తొలి గేమ్‌లో తేరుకున్నా... తర్వాతి రెండు గేముల్లో మాత్రం కోలుకోలేకపోయాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీ ఆడుతోన్న శ్రీకాంత్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇది రెండోసారి. కొరియా  ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన శ్రీకాంత్... మలేసియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement