శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 

Shubman Gill Double Century In West Indies - Sakshi

టరొబా (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో): వెస్టిండీస్‌ ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత్‌ ‘ఎ’ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (204 నాటౌట్‌; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో శుబ్‌మన్‌ (19 ఏళ్ల 334 రోజులు) ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పిన్న వయస్కులో డబుల్‌ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 17 ఏళ్లుగా గౌతమ్‌ గంభీర్‌ పేరిట ఉన్న ఈ రికార్డును శుబ్‌మన్‌ బద్దలు కొట్టాడు. 2002లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ తరఫున గంభీర్‌ (20 ఏళ్ల 124 రోజులు) 218 స్కోరు చేశాడు. డబుల్‌ సెంచరీ చేసే క్రమంలో తెలుగుతేజం, కెప్టెన్‌ హనుమ విహారి (118 నాటౌట్‌; 10 ఫోర్లు, 1సిక్స్‌)తో కలిసి శుబ్‌మన్‌ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 315 పరుగులు జోడించాడు. దీంతో భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 4 వికెట్లకు 365 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ‘ఎ’ కడపటి వార్తలందేసరికి  రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top