పదికి పది వికెట్లు తీసిన భారత బౌలర్‌ | Shrikant Wagh roars to take all ten wickets in England | Sakshi
Sakshi News home page

పదికి పది వికెట్లు తీసిన భారత బౌలర్‌

Jul 2 2018 2:12 PM | Updated on Jul 2 2018 2:24 PM

Shrikant Wagh roars to take all ten wickets in England - Sakshi

హార్ట్‌లీపూల్‌: క్రికెట్‌లో ఒకే బౌలర్ పదికి పది వికెట్లు తీయడం చాలా కష్టం. గతంలో భారత్ తరపున అనిల్‌ కుంబ్లే టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీశాడు. అయితే మరో భారత బౌలర్‌ పది పదికి వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. విదర్భ ఆటగాడు శ్రీకాంత్‌ వాగ్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు.

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే నార్త్‌ యార్క్‌షైర్‌-సౌత్‌ దుర్హామ్‌(ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్‌ లీగ్‌లో భాగంగా స్టోక్స్‌స్లే క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడిన శ్రీకాంత్‌ వాగ్‌.. రెండు రోజుల క్రితం మిడిల్స్‌ బ్రాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిపోయాడు. మొత్తంగా 11.4 ఓవర్లు వేసిన వాగ్‌ 1 మెయిడిన్‌ సాయంతో 39 పరుగులిచ్చి పది వికెట్లను నేలకూల్చాడు. ఈ విషయాన్ని ఎన్‌వైఎస్‌డీ తన అధికారిక ట‍్వీటర్‌లో తెలిపింది.

గతంలో ఇర్పాన్‌ పఠాన్‌ ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 2003-04 అండర్‌-19 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్పాన్‌ పఠాన్‌ తొమ్మిది వికెట్లు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement