ఆసీస్‌పై హిట్టింగ్‌కు ధావన్‌ రెడీ.. | Shikhar Dhawan Practices Hard Ahead of T20I Series | Sakshi
Sakshi News home page

ఆసీస్‌పై హిట్టింగ్‌కు ధావన్‌ రెడీ..

Oct 6 2017 7:29 PM | Updated on Oct 6 2017 7:33 PM

 Shikhar Dhawan Practices Hard Ahead of T20I Series

సాక్షి, రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ టీ20ల్లో స్మిత్‌సేనపై హిట్టింగ్‌ చేసేందుకు సిద్దమయ్యాడు.  భార్య ఆరోగ్య పరిస్థితి బాలేదని ధావన్‌ తనంతట తానే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రహానే వరుసగా నాలుగు హాఫ్‌సెంచరీలతో అదరగొట్టాడు. ఈ తరుణంలో ఆసీస్‌తో జరిగే మూడు టీ20లకు జట్టులోకి తిరిగి వచ్చిన ధావన్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. 

రాంచీ స్టేడియం పరిసరాల్లో వర్షం పడుతుండటంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ భారత ఆటగాళ్లకి ప్రాక్టీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సౌకర్యంతో నెట్స్‌లో ధావన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని బీసీసీఐ ట్విట్‌ చేసింది. ఇందులో ధావన్ స్వీప్‌ షాట్‌తో పాటు బౌన్సర్లని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసేలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. శ్రీలంకతో ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌లో ధావన్ మెరుగ్గా రాణించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.  అంతకు ముందు చాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ప్రదర్శనతో గోల్డెన్‌ బ్యాట్‌ అందుకున్న  విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement