షమీకి పితృవియోగం | Shami's father passes away | Sakshi
Sakshi News home page

షమీకి పితృవియోగం

Jan 27 2017 10:18 PM | Updated on Sep 5 2017 2:16 AM

షమీకి పితృవియోగం

షమీకి పితృవియోగం

టీమిండియా పేస్‌బౌలర్‌ మహమ్మద్‌ షమీకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తౌసిఫ్‌ అలీ గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు.

కాన్పుర్‌: టీమిండియా పేస్‌బౌలర్‌ మహమ్మద్‌ షమీకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తౌసిఫ్‌ అలీ గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న షమీ హుటాహుటిన అమ్రోహాకు బయలుదేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీమిండియా టీ 20 జట్టులో షమీ ఉన్న విషయం తెలిసిందే.

అయితే, మోకాలికి చిన్నగాయం కారణంగా జట్టుతోపాటే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.  ఈ నెల(జనవరి) 5న గుండెపోటు కారణంగానే ఆస్పత్రిలో చేరిన షమీ తండ్రి గురువారం మరోసారి గుండెపోటు రావడంతో చనిపోయారు. ఇదిలా ఉండగా, రెండో టీ20కి వేదికైన లక్నోకు భారత జట్టు యధావిదిగా వెళుతుందని ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ యధువీర్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement