డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా రేపటినుంచి ఈడెన్‌గార్డెన్స్‌లో భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య జరుగనున్న సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పాల్గొంటున్నాడు.
కోల్కతా: భారత్ లో నిర్వహించే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా రేపటినుంచి ఈడెన్‌గార్డెన్స్‌లో భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య జరుగనున్న సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పాల్గొంటున్నాడు. అతనితో పాటు వృద్ధిమాన్ సాహా కూడా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి నాలుగురోజుల పాటు జరుగనున్న ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ పై షమీ ఉత్సుకత చూపిస్తున్నాడు.
'కేవలం బంతి రంగు మాత్రమే మారిన టెస్టు మ్యాచ్ కచ్చితంగా సరికొత్త సవాల్. పింక్ బంతుల టెస్టు మ్యాచ్ కు మనం తొందరగా అలవాటు పడాలి. ఎంతో భవిష్యత్తు ఉందని నిపుణుల చెబుతున్న పింక్ బాల్తో ఆడటం కోసం ఆతృతగా ఉన్నా'అని షమీ తెలిపాడు. ఫ్లడ్ లైట్ల కాంతిలో బ్యాట్మెన్కు బౌలర్ కు మధ్య జరిగే పోరాటంలో బంతి ఎంతవరకూ స్వింగ్ అవుతుందో లేదో చూడాలని ఉందన్నాడు. ఈ మ్యాచ్ 2.30నుంచి రాత్రి 9 వరకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.