తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా..

Shakib Al Hasan 1st Bangladesh batsman to score 1000 World Cup runs - Sakshi

లండన్‌: బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబుల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో షకీబుల్‌(51) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించాడు. తాజా వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ షకీబుల్‌ సాధించిన పరుగులు 476.  దాంతో డేవిడ్‌ వార్నర్‌(447)ను షకీబుల్‌ అధిగమించాడు. 

ఈ టోర్నీలో షకీబుల్‌ సాధించిన పరుగుల్లో రెండు సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లపై శతకాలతో మెరిశాడు షకీబుల్‌. ఇప్పటివరకూ షకీబుల్‌ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. 2007లో షకీబుల్‌ వరల్డ్‌కప్‌ ప్రస్థానం ఆరంభం కాగా, అతనికి ఇది 27 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌. మరొకవైపు వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు షకీబుల్‌. ఇక్కడ తమీమ్‌ ఇక్బాల్‌ తొలి స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఆరు వేల వన్డే పరుగులు సాధించిన జాబితాలో ఇద్దరు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఉండగా అందులో షకీబుల్‌ స్థానం సంపాదించాడు.


 

,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top