
షారుఖ్ టీ 20 జట్టు పేరు మారింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహ యజమాని.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహ యజమాని. అయితే కరేబియన్ లీగ్ లో తన జట్టు పేరును మార్చాలని భావించాడు షారుఖ్. దానిలో భాగంగానే గతేడాది టైటిల్ సాధించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో పేరులో స్వల్ప మార్పులు చేశారు.
ట్రినిడాడ్ లోని ట్రిన్ ను, టొబాగోలోని బాగోని తీసుకుని ఆ పేరుకు చివర నైట్ రైడర్స్ చేర్చారు. దీంతో ఆ పేరు ట్రిన్బాగో నైట్ రైడర్స్(టీకేఆర్) గా మారింది. ఇక నుంచి ఇదే పేరుతో షారుఖ్ జట్టు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అలరించనుంది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధృవీకరించారు. తొలుత టిన్బాగోగానే మార్చాలనుకున్నామని, అయితే ఐపీఎల్లో నైట్ రైడర్స్ కు ఉన్న బ్రాండ్ వేల్యూతో ఆ పేరును కూడా చేర్చినట్లు స్పష్టం చేశారు.