breaking news
TKR
-
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
-
ఏం చేశారని తీగలకు టికెట్ ఇచ్చారు?
హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కమారుగా బహిర్గతమయ్యాయి. తీగల కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించటంపై నిరసనలు వ్యక్తం చేస్తూ కొత్త మనోహర్ రెడ్డి అనుచరులు మంగళవారం కొత్తపేట చౌరస్తా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం యూత్ అధ్యక్షుడు చిక్కుళ్ళ శివప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తీగలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో కొత్తపేట నుంచి దిల్సుఖ్నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కాగా పోలీస్‌లు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం చిక్కుళ్ళ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఏం చేశారని, తీగలకు తిరిగి టికెట్ ఇవ్వటం దారుణమన్నారు. తమ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ఛాలెంజ్ చేశారు. కొత్త మనోహర్ రెడ్డిని ఇండిపెండెంట్‌గా గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు. తీగల కృష్ణారెడ్డి ఆర్కెపురం లో తన కోడల్ని కార్పొరేటర్‌గా గెలిపించుకోలేకపోయారని, ఇటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించా రు. కార్యక్రమంలో మేకల రవీందర్ రెడ్డి, పాశం ప్రవీణ్ రెడ్డి, వేద భవాని, లలిత, లక్ష్మి, భాస్కర్, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
షారుఖ్ టీ 20 జట్టు పేరు మారింది!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహ యజమాని. అయితే కరేబియన్ లీగ్ లో తన జట్టు పేరును మార్చాలని భావించాడు షారుఖ్. దానిలో భాగంగానే గతేడాది టైటిల్ సాధించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో పేరులో స్వల్ప మార్పులు చేశారు. ట్రినిడాడ్ లోని ట్రిన్ ను, టొబాగోలోని బాగోని తీసుకుని ఆ పేరుకు చివర నైట్ రైడర్స్ చేర్చారు. దీంతో ఆ పేరు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(టీకేఆర్) గా మారింది. ఇక నుంచి ఇదే పేరుతో షారుఖ్ జట్టు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అలరించనుంది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధృవీకరించారు. తొలుత టిన్బాగోగానే మార్చాలనుకున్నామని, అయితే ఐపీఎల్లో నైట్ రైడర్స్ కు ఉన్న బ్రాండ్ వేల్యూతో ఆ పేరును కూడా చేర్చినట్లు స్పష్టం చేశారు. -
'ఈనెల 29న టీఆర్ఎస్లో చేరుతున్నా'