బెంచ్‌ వార్మర్స్‌కు రెండో విజయం  | Second win for bench warmers in super league basket ball tournament | Sakshi
Sakshi News home page

బెంచ్‌ వార్మర్స్‌కు రెండో విజయం 

Dec 10 2017 10:50 AM | Updated on Sep 4 2018 5:32 PM

Second win for bench warmers in super league basket ball tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా వార్షిక సూపర్‌ లీగ్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో కస్టమ్స్‌ జీఎస్‌టీ, బెంచ్‌ వార్మర్స్‌ ‘బి’ జట్లు వరుసగా రెండో విజయాన్ని సాధించాయి. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కస్టమ్స్‌ జీఎస్‌టీ 83–46తో సికింద్రాబాద్‌ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది.

విజేత జట్టులో విజయ్‌ కుమార్‌ (20), బిట్టు (19) ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్‌ జట్టులో అమన్‌ (16), త్రిభువన్‌ (12), అనిరుధ్‌ (10) పోరాడారు. మరో మ్యాచ్‌లో బెంచ్‌ వార్మర్స్‌ ‘బి’ జట్టు 41–40తో ఎస్‌బీఐ జట్టుపై గెలుపొందింది. బెంచ్‌ వార్మర్స్‌ తరఫున శ్రీకాంత్‌ (13), రోహిత్‌ (11) మెరుగ్గా ఆడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement