మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో... | Satwik And Chirag Got 9th Place In World Ranking Of Badminton | Sakshi
Sakshi News home page

మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో...

Oct 30 2019 3:17 AM | Updated on Oct 30 2019 3:17 AM

Satwik And Chirag Got 9th Place In World Ranking Of Badminton - Sakshi

న్యూఢిల్లీ: గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 11వ ర్యాంక్‌ నుంచి 9వ ర్యాంక్‌కు చేరుకుంది. రెండోసారి తమ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఆగస్టులో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్‌ సాధించాక ఈ ఇద్దరు తొలిసారి 9వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత టాప్‌–10 నుంచి బయటకు వచ్చి...ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రాణించి మళ్లీ టాప్‌–10లోకి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement