మెరిసిన సామ్సన్, శార్దుల్‌

Sanju Samson stars in IND A 36-run win - Sakshi

చివరి వన్డేలో భారత్‌ ‘ఎ’ విజయం

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన చివరి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ మెరుపులు... బౌలింగ్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ (3/9) విజృంభణ భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 51; 5ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ సామ్సన్‌ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు.  అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ హెండ్రిక్స్‌ ( 59; 10 ఫోర్లు) రాణించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top