సంజనకు హ్యాట్రిక్‌ టైటిల్‌ | Sanjana wins another AITA Title | Sakshi
Sakshi News home page

సంజనకు హ్యాట్రిక్‌ టైటిల్‌

Jun 30 2018 10:30 AM | Updated on Jun 30 2018 10:30 AM

Sanjana wins another AITA Title - Sakshi

హైదరాబాద్‌: ‘ఐటా’ టెన్నిస్‌ టోర్నమెంట్‌లలో హైదరాబాద్‌ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడ విజయాలతో సత్తా చాటుతోంది. కొంపల్లిలోని సురేశ్‌ కృష్ణ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన అండర్‌–16 టోర్నీలో సంజన విజేతగా నిలిచింది. ఈనెలలో ఆమెకు ఇది మూడో సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. జూన్‌ 11 నుంచి 16 వరకు జరిగిన అండర్‌–18 చాంపియన్‌షిప్‌ సిరీస్, జూన్‌ 18 నుంచి 23 వరకు జరిగిన అండర్‌–16 సూపర్‌సిరీస్‌ టోర్నీల్లోనూ సంజన విజేతగా నిలిచింది. శుక్రవారం  జరిగిన ఈ టోర్నీ అండర్‌–16 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో సంజన 6–2, 6–4తో రితి అగర్వాల్‌ (కర్ణాటక)పై గెలుపొందింది. 

బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఆర్యన్‌ భటి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ అండర్‌–16 బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్‌పోరులో అదితి 6–0, 6–2తో త్రిష్యా ఖండేవాల్‌ (కర్ణాటక)ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement