
బల్గేరియా: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్... డాన్ కొలొవ్ రెజ్లింగ్ మీట్‌లో తుదిపోరుకు అర్హత సాధించింది. 65 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీ సెమీఫైనల్లో సాక్షి 4–1తో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని కంగుతినిపించింది. దీంతో భారత రెజ్లర్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. నేడు పసిడి పతకం కోసం సాక్షి... హెన్నా జొహన్సన్ (స్వీడెన్)తో తలపడుతుంది.