సాకేత్‌కు సన్మానం | Saketks honor | Sakshi
Sakshi News home page

సాకేత్‌కు సన్మానం

Oct 11 2014 1:09 AM | Updated on Sep 2 2017 2:38 PM

సాకేత్‌కు సన్మానం

సాకేత్‌కు సన్మానం

సనత్‌నగర్: ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన తెలుగు తేజం, భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేనికి...

సనత్‌నగర్: ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన తెలుగు తేజం, భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేనికి ప్రముఖ సీఏ విద్యా సంస్థ మాస్టర్‌మైండ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా సాకేత్‌ను ఆ సంస్థ కార్యాలయంలో డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ రంగంలో ఉన్నా తెలుగువాడు తన సత్తా చాటుతూ భారతదేశ గొప్పతనాన్ని నిలబెడుతూనే ఉంటాడని అన్నారు. క్రీడల్లో రాణించాలనుకునే యువతకు సాకేత్ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ ఇన్‌చార్జి శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement