బెంగళూరు ఓపెన్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట | Saket pair in Bangalore open doubles quarterfinals | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఓపెన్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట

Nov 13 2018 1:04 AM | Updated on Nov 13 2018 1:08 AM

Saket pair in Bangalore open doubles quarterfinals - Sakshi

టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు సాధించిన సాకేత్‌ మైనేని–అర్జున్‌ ఖడే (భారత్‌) జంట బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌ అర్జున్‌ ద్వయం 6–3, 3–6, 11–9తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సంచాయ్‌–సొంచాట్‌ రటివటానా (థాయ్‌లాండ్‌) జోడీపై గెలుపొందింది. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒకదశలో సాకేత్‌ జంట 1–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకున్న ఈ భారత జంట స్కోరును 9–9తో సమం చేసింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement