కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాకేత్ | Saket career-best rankings | Sakshi
Sakshi News home page

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాకేత్

Feb 23 2016 1:00 AM | Updated on Sep 3 2017 6:11 PM

గతవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్

న్యూఢిల్లీ: గతవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 158వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ ఎనిమిది స్థానాలు పడిపోయి 107వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతవారమే కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడాభివృద్ధి నిధి నుంచి యూకీకి రూ. 37 లక్షలు... సాకేత్‌కు రూ. 36 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. గతేడాది ఢిల్లీ ఓపెన్ విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ ఈసారి టోర్నీలో ఆడకపోవడంతో 87 స్థానాలు పడిపోయి 279వ ర్యాంక్‌లో నిలిచాడు. ఢిల్లీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన మహేశ్ భూపతి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 61 స్థానాలు పురోగతి సాధించి 225వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహన్ బోపన్న ఎనిమిదో ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 57వ ర్యాంక్‌లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement