వాలీబాల్‌ చాంప్‌ సెయింట్‌ ఆంథోనీస్‌ | saint anthony's wins wallyball title | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ చాంప్‌ సెయింట్‌ ఆంథోనీస్‌

Jul 25 2017 11:00 AM | Updated on Sep 5 2017 4:51 PM

వాలీబాల్‌ చాంప్‌ సెయింట్‌ ఆంథోనీస్‌

వాలీబాల్‌ చాంప్‌ సెయింట్‌ ఆంథోనీస్‌

రుక్మిణీబాయి ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో సెయింట్‌ ఆంథోనీస్‌ బాలికల హైస్కూల్‌ జట్టు వాలీబాల్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: రుక్మిణీబాయి ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో సెయింట్‌ ఆంథోనీస్‌ బాలికల హైస్కూల్‌ జట్టు వాలీబాల్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. సికింద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో సెయింట్‌ ఆంథోనీస్‌ జట్టు 8–25, 25–20, 15–13తో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూల్‌పై విజయం సాధించింది.

 

తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ అమ్మాయిలు రెండో గేమ్‌లో పోరాడి ఓడారు. తర్వాత నిర్ణాయక మూడో గేమ్‌ కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. ఇందులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సెయింట్‌ ఆంథోనీస్‌ జట్టు రెండు పాయింట్లతో గేమ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన బాలికల జట్టును ఆంథోనిస్‌ స్కూల్‌ యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement