రోహిత్ శర్మ సెంచరీ | rohit sharma gets century | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ సెంచరీ

Oct 11 2015 3:50 PM | Updated on Sep 3 2017 10:47 AM

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(101 బ్యాటింగ్; 100 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ నమోదు చేశాడు.

కాన్పూర్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(101 బ్యాటింగ్; 100 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు)  సెంచరీ నమోదు చేశాడు. ఆదిలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ ఆ తరువాత దూకుడును పెంచి శతకాన్ని సాధించాడు. దీంతో వన్డేల్లో రోహిత్ ఎనిమిదో సెంచరీని నెలకొల్పాడు. అజింక్యా రహానే(60) కలిసి రెండో వికెట్ కు 149 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో రోహిత్ సహకరించాడు. క్రీజ్ లో రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి(5) ఉన్నాడు.

 

దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా దీటుగా బదులిస్తోంది. 37 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement