రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు | Rishabh Pant blasts fastest century in Ranji Trophy history | Sakshi
Sakshi News home page

రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు

Nov 8 2016 4:30 PM | Updated on Sep 4 2017 7:33 PM

రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు

రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు

ఈ రంజీ సీజన్లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు.

త్రివేండ్రం:ఈ రంజీ సీజన్లో ఢిల్లీ  ఆటగాడు రిషబ్ పంత్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. గ్రూప్ -బిలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్  అత్యంత వేగంగా సెంచరీ బాదాడు.  ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 48 బంతుల్లో శతకం సాధించి రంజీ చరిత్రలో వేగవంతంగా ఆ ఘనతను నమోదు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్గా 135 పరుగులు చేసిన రిషబ్.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగి ఆడాడు.

 

దాంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక మ్యాచ్లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రిషబ్ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఎనిమిది సిక్సర్లు కొట్టిన రిషబ్.. రెండో ఇన్నింగ్స్లో 13 సిక్సర్లను కొట్టాడు. అయితే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో పేరిట ఉంది.  2015లో మున్రో ఒక మ్యాచ్ లో 23 సిక్సర్లు సాధించాడు.

ఇదిలా ఉండగా, ఈ సీజన్లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో రిషబ్ ట్రిపుల్ సాధించిన సంగతి తెలిసిందే. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రిషబ్ 308 పరుగులు సాధించాడు.తాజాగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి మరోసారి మెరిశాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాజేశ్ బారోహ్, వీబీ చంద్రశేఖర్ లు సంయుక్తంగా 56 బంతుల్లో నమోదు చేసిన ఫాస్టెస్ట్ రికార్డు చెరిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement