ఆర్సీబీ మూడోసారి.. | RCB third time Ten Wicket win in IPL | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ మూడోసారి..

May 14 2018 10:52 PM | Updated on May 15 2018 4:27 AM

RCB third time Ten Wicket win in IPL - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ మూడోసారి వికెట్‌ పడకుండా గెలుపును అందుకుంది. అంతకుముందు 2010 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ(99/0) పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర‍్సీబీ(93/0) వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదిలా ఉంచితే, ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత్యధిక బంతులు మిగిలి ఉండగా గెలుపొందిన నాల్గో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. 2008లో కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ 87 బంతులుండగా విజయం సాధించగా, 2011లో రాజస్తాన్‌ రాయల్స్‌పై కొచ్చి టస్కర్స్‌ కేరళ 76 బంతులుండగా గెలుపును సొంతం చేసుకుంది. గతేడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌ పంజాబ్‌ 73 బంతులు ఉండగా గెలుపొందగా, తాజాగా కింగ్స్‌ పంజాబ్‌పై ఆర్సీబీ 71 బంతులు మిగిలి ఉండగా విజయం నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement