‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’ | Ravindra Jadeja Was inconsolable, Reveals wife | Sakshi
Sakshi News home page

‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’

Jul 14 2019 2:33 PM | Updated on Jul 14 2019 2:58 PM

Ravindra Jadeja Was inconsolable, Reveals wife - Sakshi

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో టీమిండియాను విజయం అంచున నిలబెట్టాడు.  92/6తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడినప్పుడు ధోని అండగా జడ్డూ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 77 రన్స్‌ చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో జడేజా అవుటవడంతో భారత్‌ 18 రన్స్‌తో ఓడింది.

కానీ, జట్టు స్వల్ప తేడాతో ఓడడంతో జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపారు. ఈ పరాజయంతో జడేజా గుండె పగిలినంత పనైందని అతడి భార్య రివాబా చెప్పారు. ‘సెమీస్‌లో ఓటమి తర్వాత జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్‌ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు. జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’రివాబా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement