అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (70) అర్ధసెంచరీతో రాణించాడు. సుమంత్ (56 బ్యాటింగ్) అర్ధసెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు.
అనంతపురం, సాక్షి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (70) అర్ధసెంచరీతో రాణించాడు. సుమంత్ (56 బ్యాటింగ్) అర్ధసెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్ బౌలర్లు విఫలం
హైదరాబాద్, సాక్షి: మహారాష్ట్రతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. తొలిరోజు మహారాష్ట్ర జట్టు 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగలు చేసింది. ఖడీవాలే (107), కేదార్ జాదవ్ (175 బ్యాటింగ్) సెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్, అమోల్ షిండే రెండేసి వికెట్లు తీశారు.