రంగారెడ్డి జిల్లా ‘ట్రిపుల్’ | Ranga Reddy district TRiple | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా ‘ట్రిపుల్’

Jan 20 2014 2:24 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఏపీ రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ రంగారెడ్డి మహిళల జట్లు సత్తా చాటాయి. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మహిళల సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలు మూడింటిలోనూ రంగారెడ్డి టీమ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.

 సాక్షి, విజయనగరం: ఏపీ రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ రంగారెడ్డి మహిళల జట్లు సత్తా చాటాయి. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మహిళల సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలు మూడింటిలోనూ రంగారెడ్డి టీమ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. మహిళల కేటగిరీలో పై మూడు విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లానే రన్నరప్‌గా నిలిచింది.
 
 పురుషుల విభాగంలో సీనియర్‌లో విజయనగరం, జూనియర్‌లో తూర్పు గోదావరి, సబ్ జూనియర్‌లో కర్నూలు జట్లు టీమ్ చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకోగా...జూనియర్‌లో కర్నూలు, సీనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో తూర్పు గోదావరి జట్లు రన్నరప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగం మూడు కేటగిరీల్లో ఎం. రామకృష్ణ, ఎస్. రామ్మోహన్‌రావు, పారపాటి రమేశ్‌లకు బెస్ట్ లిఫ్టర్ల అవార్డు దక్కింది. మహిళల విభాగంలో కె. వెంకటలక్ష్మి, కె. శిరీష, టి. ప్రియదర్శినిలు ఉత్తమ లిఫ్టర్లుగా నిలిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement